
*వెలమ కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తా*
*వెలమ కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తా*
*వెలమ సంక్షేమ సంఘం నూతన ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నడిపెల్లి వెంకటేశ్వరరావు*
*ప్రజా కలం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి*
వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన నడిపెల్లి వెంకటేశ్వరరావు,కార్యదర్శి కోశాధికారి ఇతర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం హనుమకొండలోని హంటర్ రోడ్ షైన్ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీందర్రావు,ఆల్ ఇండియా వెలమ సంఘం వైస్ ప్రెసిడెంట్ హాజరయ్యారు,ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన నడిపెల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వెలమ సంక్షేమ సంఘానికి కృషి చేస్తూ సంఘం అభ్యున్నతకు నిరంతరం పాటు పాటుపడతామని తెలిపారు. ముఖ్యంగా వెలమ కులస్తులో ఉన్న నిరుపేదల పిల్లల విద్యకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వెలమ కులస్తులందరికీ ఎలాంటి కష్టం ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పెద్దల సహకారంతో వాటిని పరిష్కరిస్తామని ఆయన అన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా 1500 మంది వెలమ కులస్తులు హాజరై తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంఘ నాతోటి బాంధవులందరు పాల్గొన్నారు.