
కార్పొరేట్ విద్యాసంస్థల నిలువు దోపిడి
కార్పొరేట్ విద్యాసంస్థల నిలువు దోపిడి
యథేచ్ఛగా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న సిబ్బంది
ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని యాజమాన్యం
పాఠశాలలకు సమీపంలోనే అద్దెకు గదులు
ఫీజు చెల్లింపుల్లో డిస్కౌంట్ ఆఫర్లు
చర్యలు తీసుకోవాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు
జగిత్యాల జూన్ 18 (ప్రజాకలం జిల్లా ప్రతినిధి): జగిత్యాల జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల, కార్పొరేట్ యాజమాన్యాలు నిబంధనలను అతిక్రమిస్తున్నాయి. స్కూల్‌లోనే పుస్తకాలు కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకు ఏకంగా స్కూళ్లల్లోనే స్టాల్స్ ఏర్పాటు చేశారు. బుక్స్ మాత్రమే కాదు.. యూనిఫాం, టై, బెల్టులు తమ వద్దనే కొనాలని అంటున్నారు. దీంతో పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, టై, బెల్టుల అమ్మకాలతో పాఠశాలల దుకాణాలను మరిపిస్తున్నాయి. ప్రైవేటు బడుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యనందించాల్సిన యాజమాన్యాలు ధనార్జనే ధ్యేయంగా విద్యతో వ్యాపారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. నర్సరీ మొదలుకొని పదో తరగతి వరకు స్టడీ మెటీరియల్, అదీ ఇదీ అంటూ వేలాది రూపాయల వసూలు చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నిబంధనలను భేఖాతరు చేస్తున్నా సంబంధిత అధికారులు పాఠశాలల వైపు కన్నెత్తి చూడక పోవడం విమర్శలకు తావిస్తోంది. కార్పొరేట్ విద్యాసంస్థల నిలువు దోపిడి యథేచ్ఛగా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న సిబ్బంది, ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని యాజమాన్యం పాఠశాలలకు సమీపంలోనే అద్దెకు గదులు, ఫీజు చెల్లింపుల్లో డిస్కౌంట్ ఆఫర్లు, చర్యలు తీసుకోవాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు

