వినాయక నిమర్జనం లో విషాదం..

వినాయక నిమర్జనం లో విషాదం..

మల్లాపూర్ సెప్టెంబర్ 07 ( ప్రజా కలం ప్రతినిధి)
వినాయక నిమర్జనం ఉత్సవాలు ఆనందంగా సాగుతుండగా మండలం లోని ముత్యం పేట గ్రామం లో విషాదం చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముత్యం పేట గ్రామానికి చెందిన యువకుడు చిట్యాల అరవింద్ వినాయక నిమర్జనం లో టపాకాయలు కాల్చుతుండగా కొన్ని టపాకాయలు పేలక పోవడం తో పరిశీలించడానికి దగ్గరికి వెళ్ళడం తో ఒక్కసారిగా టపాకాయలు పేలడంతో యువకుడు చిట్యాల అరవింద్ తీవ్రంగా గాయపడ్డాడు. కళ్ళు, ముఖం దెబ్బతినడంతో రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆందోళన చెందుతూ వెంటనే నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో వినాయక నిమర్జన వేడుకల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
టపాకాయల వాడకం నియంత్రించాలి:
ప్రతి సంవత్సరం నిమర్జన సమయంలో టపాకాయలు, బాణసంచా వాడకం పెరుగుతోంది. చిన్న నిర్లక్ష్యం ప్రాణాలను తీస్తోంది. ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం తగదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, అధికారులు ముందుగానే చర్యలు తీసుకుని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )