దర్శనానికి వెళ్ళి గుండంలో జారీ పడి వివాహిత మృతి*

దర్శనానికి వెళ్ళి గుండంలో జారీ పడి వివాహిత మృతి*

*దర్శనానికి వెళ్ళి గుండంలో జారీ పడి వివాహిత మృతి*
*వలిగొండ జనవరి 18 ప్రజాకలం*:కూతురు పుట్టినరోజు సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గుండంలో కాళ్లు కడుగుతుంటుండగా గుండంలో జారీ పడి వివాహిత మృతి చెందిన సంఘటన వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో చోటు చేసుకుంది..కుటుంబ సభ్యులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..యాదగిరి గుట్ట మండలం మల్లాపురంకి చెందిన వివాహిత కర్రె లాస్య సంక్రాంతి పండుగా సందర్భంగా తన తల్లి గారి ఊరైన పులిగిల్ల గ్రామానికి వచ్చింది.ఆదివారం ఆమె కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించేందుకు వెళ్ళి గుండంలో కాళ్లు కడుగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడటంతో గమనించిన స్థానికులు బయటకి తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.మృతురాలికి కుమార్తె,కుమారుడు ఉన్నట్లు తెలిపారు…దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి…చనిపోయే ముందు రామాలయం గుట్ట పైకి ఎక్కుతున్న క్రమంలో తన నాన్నతో తీసిన వీడియో ఇన్స్టా లో పోస్ట్ చేయడంతో పలువురినీ కంట తడి పెట్టిస్తుంది…

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )