
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 400 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు
400 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు
ఓట్ల లెక్కింపు సందర్భంగా 144 సెక్షన్ అమలువిజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధo
ఎలక్షన్ కమిషన్ ద్వారా జారీ చేయబడిన గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ప్రతినిధి ఫిబ్రవరి 12 (ప్రజా కలం) మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా 400 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం అయిన డిగ్రీ కాలేజీ వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి పరిశీలించారు.ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ సెక్షన్ రేపు ఉదయం 6 గంటల నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపారు.ఈ సెక్షన్ అమలులో ఉన్నప్పుడు ధర్నాలు,రాస్తారోకోలు, ఊరేగింపులు, టపాకాయలు కాల్చడం,సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధమని వాటిని నిర్వహించ కూడదని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైన డిగ్రీ కాలేజీ పరిసర ప్రాంతాలను డాగ్స్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపునకు హాజరు అయే అభ్యర్థులు, ఏజెంట్లు, నిషేధిత వస్తువుల అయిన అగ్గిపెట్టెలు, లైటర్,ఇంక్ బాటల్స్, పేలుడు కారణం అయే ఎలాంటి వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకురాకూడదని తెలిపారు మరియు తనిఖీలు చేసే సిబ్బందికి సహకరించాలని కోరారు. ఎలక్షన్ కమిషన్ ద్వారా జారీ చేయబడిన గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతి ఉంటుంది అన్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి లు రఘు చందర్,రాములు ఇన్స్పెక్టర్ లు, ఎస్.ఐ లు పాల్గొన్నారు.

