
వాటర్ ప్లాంట్ యజమానులు ఐఎస్ఐ మార్కు పొందాలి
ఐ ఎస్ ఐ మార్క్ నిబంధనల మేరకే వాటర్ సరఫరా జరగాలి
మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి నవంబర్ 06(ప్రజా కలం)ఐ ఎస్ ఐ మార్క్ నిబంధనల మేరకే వాటర్ సరఫరా చేయాలని మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ వెల్లడించారు. గురువారం మున్సిపల్ కమిషనర్ వాటర్ ప్లాంట్ యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని వాటర్ ప్లాంట్ యజమానులు ఐఎస్ఐ మార్కు అనుమతులు తెచ్చుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి వాటర్ ప్లాంట్ యజమానికి రెండు నెలల గడువు ఇస్తున్నామన్నారు. విక్రయిస్తున్న మంచినీటిని శుద్ధి చేసి ఇవ్వాలని, నీటిని సరఫరా చేసేటప్పుడు వినియోగించే ప్లాస్టిక్ డబ్బాలను శుభ్రపరచడం విధిగా భావించాలని పేర్కొన్నారు. ఎవరు చూడట్లేదని అపరిశుభ్రమైన వాటర్ డబ్బాల్లో నీటిని అందిస్తే నీరు కలుషితం అవుతుందన్నారు. ఆరోగ్యంగా జీవించాలంటే మంచినీరు ఎంతో ప్రాముఖ్యమైందని, బోర్ వాటర్ కులాయి నీరు తాగడం వల్ల అనారోగ్యం పాలవుతున్నామని శుద్ధి జలాన్ని సేవిస్తున్నారని భావించాలన్నారు. మంచినీరు కలుషితం వలన ప్రజలు జ్వరాల బారినపడి అనారోగ్యాల పాలవుతారని వెల్లడించారు. మంచినీరు కలుషితం కాకుండా చూడాలని,మంచినీరు డబ్బాలు కడగకుండా అలాగే నింపుకొని సప్లై చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అలా చేసినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు నెలల్లో ఐఎస్ఐ మార్కు పర్మిషన్ కచ్చితంగా తెచ్చుకోవాలని, ఐఎస్ఐ అనుమతులకు పాటించాల్సిన నిబంధనలు వాటర్ ప్లాంట్ యజమానులు కచ్చితంగా పాటించాలన్నారు. ఏ ఒక్కరూ నిబంధనలు పాటించడం లేదని ఫిర్యాదులు వస్తే సదరు వాటర్ ప్లాంట్లను మూసివేస్తామని అన్నారు. పాటించని ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్,ముజీబ్ వాటర్ ప్లాంట్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

