
రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి..
రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి..
మల్లాపూర్ ఫిబ్రవరి 02 ( ప్రజా కలం ప్రతినిధి)
మండలంలోని సాతారం,ధర్మారం గ్రామాల మధ్య గల రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో చిట్టాపూర్ గ్రామానికి చెందిన బొమ్మడి యశ్వంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఆగకుండా వెళ్లినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
TAGS Hot News

