కాకతీయ కాలువలో యువకుని గల్లంతు

కాకతీయ కాలువలో యువకుని గల్లంతు

జడ్పిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి ఆగస్టు 28 (ప్రజా కలం): మెట్ పల్లి మాజీ జడ్పిటిసి, పెద్దాపూర్ గ్రామానికి చెందిన రాధా శ్రీనివాస రెడ్డిల కుమారుడు శ్రీకర్ బుధవారం వినాయకుని తరలించే క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి కాకతీయ కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రమాదం నుండి బయటపడగా, శ్రీకర్ గల్లంతయ్యాడు. కాకతీయ కాలువలో గల్లంతైన కుమారుడి ఆచూకీ కోసం కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులను గురువారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి,కోరుట్ల నిజయోకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు లు మాజీ జడ్పిటిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీకర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో నీటి ప్రవాహాన్ని తగ్గించాలని సంబంధిత శాఖ అధికారులకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూచించారు. కాగా శ్రీకర్ ఆచూకీ కోసం వరద కాలువలో ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నట్లు పోలీసులు, కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )