
డ్రగ్స్ , గాంజా, చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలి.
డ్రగ్స్ , గాంజా, చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలి.
… గాంజా నివారణ కు ప్రతి కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీ..
… సీఐ అనిల్ కుమార్..
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ 23 (ప్రజా కలం)యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని. మత్తు పదార్థాలకు మానసికగా బానిస కావడం ద్వారా అనుకోకుండా క్రైమ్ చేసే అవకాశం ఉంది అని సీఐ అనిల్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు గవర్నమెంట్ కాలేజీలో సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ కిరణ్ కుమార్ ల ఆధ్వర్యంలో డ్రగ్స్ , క్రైమ్, ర్యాగింగ్, సైబర్ అబ్యుజ్ అండ్ మిశ్యుజ్ అనే అంశాల పై అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ. అనుకోకుండా ఏదైనా క్రైం చేసినట్లయితే ఎలాంటి ఉద్యోగం రాదని డ్రగ్స్,గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో ఉన్నత లక్ష్యాల ను సాధించేందుకు ధైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో యువత పోటీ తత్వంతో ఉండాలని చెడు అలవాట్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. ముఖ్యంగా సామాజిక మధ్యమాలైన ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇన్ స్టాగ్రామ్ ల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని , ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసే సమయంలో, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టుదలతో ఉన్నత స్థాయి అధిరోహించాలని, ఆ క్రమంలో తప్పుదారులు పట్టకుండా, తల్లిదండ్రులు నమ్మకాన్ని వమ్ముచేయకుండా జీవితంలో కష్టపడి సొంత కాళ్ళ పై నిలబడాలని సూచించారు.

