రైతాంగానికి అండగా నాడు వైఎస్… నేడు రేవంత్ రెడ్డి…!

రైతాంగానికి అండగా నాడు వైఎస్… నేడు రేవంత్ రెడ్డి…!

రైతాంగానికి అండగా నాడు వైఎస్… నేడు రేవంత్ రెడ్డి…!
…. రైతు సంక్షేమంలో.. రాజీ * లేదు …!
…. 67.01 లక్షల రైతులకు రూ.8,284.66 కోట్లు జమ
… రైతు భరోసా ఎకరా 10వేలు నుండి 12వేలు లను పెంపు
…సన్న సాగుకు 500 మద్దతు ధర
రాయికల్ జూన్ 25 (ప్రజా కలం ప్రతినిధి)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమంలో రాజీ లేకుండా రైతంగానికి అండగా ఉన్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి అన్నారు.మంగళవారం రాయికల్ పట్టణంలోని శివాజీ విగ్రహం వద్ద సకాలంలో రైతు భరోసా విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ రైతులు, కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం, టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాల మధ్య కూడా రైతు సంక్షేమంలో రాజీ లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.గత ఏడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 67.01 లక్షల మంది రైతులకు రూ.8,284.66 కోట్లు నిధులు ఆయా రైతు ఖాతాల్లో జమ అయ్యాయన్నారు. సన్న వడ్లకు 500 బోనస్, రుణమాఫీ,ఉచిత విద్యుత్తు,మార్క్ ఫెడ్ ద్వారా పంట సేకరణ వంటి చర్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రాజ్యాన్ని నిర్మిస్తుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన ప్రతిపక్షాలు దురుద్దేశంతో విమర్శలు చేయడం వారి అవివేకానికి నిదర్శనం అన్నారు.ఈ కార్యక్రమంలో మండల రైతులు,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,మండల ప్రధాన కార్యదర్శి మహేందర్ గౌడ్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షాకీర్,హనుమాన్ ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్,నాయకులు ఎద్దండి భూమారెడ్డి,తంగేళ్ల రమేష్,కొయ్యేడి మహిపాల్ రెడ్డి,బాపురపు నర్సయ్య,బత్తిని భూమయ్య,కోడిపెల్లి ఆంజనేయులు,సింగని రమేష్,రాము,పరాచ శంకర్,కడకుంట్ల నరేష్,మండ రమేష్,రాకేష్ నాయక్,తలారి రాజేష్,మురళి,భూమా గౌడ్, రాజారెడ్డి,కిరణ్, సాగర్,రాజేష్,సంతోష్,రాజేందర్,రవీందర్, రాజశేఖర్,నాగరాజు,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )