
అసత్య ప్రచారాలు మాని సభకు సహకరించాలి.
అసత్య ప్రచారాలు మాని సభకు సహకరించాలి.
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ 11 వ వార్డు కొమిరెడ్డి లింగారెడ్డి.
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి మార్చి 19 ప్రజా కలం అసత్య విష ప్రచారాలు మాని సభకు సహకరించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు,11 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొమిరెడ్డి లింగారెడ్డి తెలిపారు.పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీసీ నాయకులు కోటి రూపాయల వాచ్ తో అసెంబ్లీకి వచ్చారని అసత్య ప్రచారాలు వాట్సాప్ ద్వారా విదేశాల నుండి చేస్తూ వారిపై మచ్చ తేవడానికి ప్రయత్నిస్తున్నారని కొమిరెడ్డి లింగారెడ్డి మండిపడ్డారు. ఆది శ్రీనివాస్ ధరించిన వాచ్ మైకేల్ కోర్స్ కంపెనీ దని విలువ పదివేల నుండి 40 వేల వరకు ఉంటుందని అన్నారు. ఆయన కూడా శాసనసభ ప్రాంగణంలో ఆయన కూడా తెలిపారని అన్నారు. బిఆర్ఎస్ నాయకులకు ఎవరికైనా ఈ వాచ్ పై ఆసక్తి ఉంటే 20 వేలు గాని 30 వేలు గాని ఇచ్చి ఈ వాచ్ ను సొంతం చేసుకోవాల్సిందిగా హితవు పలికారు. ఇకనైనా టిఆర్ఎస్ నాయకులు తమ మాటలను అదుపులో పెట్టుకొని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాలని బి ఆర్ ఎస్ నాయకులను సూచించారు. ఈ సమావేశంలో విట్టం పేట సర్పంచ్ ఆరేళ్ల చిరంజీవి, కాంగ్రెస్ నాయకులు పుప్పాల శంకర్, ఆదర్శ రైతు కొమిరెడ్డి తిరుపతిరెడ్డి, ఏషాల రాజశేఖర్ రెడ్డి, బిల్డర్ కలీం, డబ్బా మధు, అనిల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

