గజ్వేల్‌లో వైభవంగా ఎడ్ల బండ్ల ప్రదర్శన

గజ్వేల్‌లో వైభవంగా ఎడ్ల బండ్ల ప్రదర్శన

గజ్వేల్‌లో వైభవంగా ఎడ్ల బండ్ల ప్రదర్శన

– ప్రారంభించిన వంటేరు ప్రతాపరెడ్డి

గజ్వేల్, 19 మార్చి 2026 :

ఉగాది పండుగను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సాప్రదాయబద్ధంగా నిర్వహించిన ఎడ్ల బండ్ల ప్రదర్శన (ఎడ్ల బండ్లు తిరిగే కార్యక్రమం) స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఎర్రవాడ బాలు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాపరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన మన పండుగలను, గ్రామీణ క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రైతులతో విడదీయలేని బంధం ఉన్న ఎడ్ల బండ్ల ప్రదర్శనను ఉగాది వేళ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎర్రవాడ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవి, వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కార్ పద్మ భాయి నర్సింగ్ రావు, కౌన్సిలర్ శ్రీధర్, బిఆర్ఎస్ నాయకులు బొగ్గుల సురేశ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )