
వైష్ణవి కేసులో ముగ్గురికి రిమాండ్
వైష్ణవి కేసులో ముగ్గురికి రిమాండ్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి మార్చి 19(ప్రజాకలం):జిల్లాలో సంచలనం సృష్టించిన కోరుట్ల మండలం మాధాపూర్ గ్రామానికి చెందిన గంధం వైష్ణవి (20) గర్భిణీ హత్య కేసులో భర్తతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు మెట్ పల్లి డిఎస్పి రాములు తెలిపారు. అయన కథనం ప్రకారం ..పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందని, ఈ కేసులో ప్రధాన నిందితుడు చిత్తారి హరిబాబు తన భార్యను కట్నం వేధింపుల నేపథ్యంలో హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు హరిబాబుకు సహకరించి, బాధితురాలిని కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించినట్లు చిత్తారి లక్ష్మి (తల్లి), చిత్తారి ఆనంద్ (అన్న), చిత్తారి అశోక్ (అన్న) పై కట్న వేధింపులు, హత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎస్సై చిరంజీవి దర్యాప్తు చేసి ఈ కేసులో నిందితులు అయిన చిత్తారి లక్ష్మి , చిత్తారి ఆనంద్, చిత్తారి అశోక్ వారిని గురువారం అరెస్ట్ చేసి, న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని రాములు పేర్కొన్నారు

