
ఖుతుబోద్దీన్ పాషా, అజీమ్ కుటుంబాలకు జిల్లా ఐ జేయు అధ్యకుడి పరామర్శ…
ఖుతుబోద్దీన్ పాషా, అజీమ్ కుటుంబాలకు జిల్లా ఐ జేయు అధ్యకుడి పరామర్శ.
మెట్పల్లి, ఏప్రిల్ 15: (ప్రజా కలం ప్రతినిధి )
కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా, మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అజీమ్ ల తల్లి మృతి పట్ల టి యు డబ్ల్యూ జే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు సంతాపం వ్యక్తం చేశారు. గత ఐదు రోజుల క్రితం వారి తల్లి మరణించగా, బుధవారం ఐ జేయు అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు జిల్లా కార్యవర్గ సభ్యులు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్న వారు, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఐ జేయు జనరల్ సెక్రెటరీ సంపూర్ణ చారి, క్యాషియర్ వేణు గోపాల్ మెట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బూరం సంజీవ్,, జిల్లా కార్యవర్గ సభ్యులు సాజిద్ పాషా, బాసెట్టి హరీష్, కార్యవర్గ సభ్యులు మహేందర్, సభ్యులు గణేష్, 20 వార్డు కౌన్సిలర్ మసూల ప్రవీణ్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

