పెద్దపెల్లి జిల్లాలో విషాదం

పెద్దపెల్లి జిల్లాలో విషాదం

పెద్దపెల్లి ఆగస్టు 22 ప్రజా కలం ప్రతినిధి : పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు గంధం నారాయణ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు.
సమాచారం మేరకు, గంధం నారాయణ కొద్ది సేపటి క్రితం తన వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, బంధుమిత్రులు ఆయన మృతితో దిగ్భ్రాంతికి గురయ్యారు.
👉 అధికారులు, పోలీసు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )