ఐఐటీ ముంబై ప్రవేశ పరీక్షలో మెరిసిన ఇంద్రాణి విద్యార్థిని

ఐఐటీ ముంబై ప్రవేశ పరీక్షలో మెరిసిన ఇంద్రాణి విద్యార్థిని

ఐఐటీ ముంబై ప్రవేశ పరీక్షలో మెరిసిన ఇంద్రాణి విద్యార్థిని

హైదరాబాద్‌ మార్చి 26 (ప్రజా కలం): బోడుప్పల్‌లోని ఇంద్రాణి జూనియర్ కళాశాల విద్యార్థిని నిమ్మల పూజిత జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచింది. 2022–2024 మధ్య ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన ఆమె, ఇటీవల IIT Bombay నిర్వహించిన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో 1152వ ర్యాంకు సాధించింది. దీంతో ఐఐటీలో ఎంఎస్సీ చదివే అర్హతను పొందింది.

ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్‌ అలువాల సుదర్శన్ పూజితను సన్మానించారు. ఆమె సాధించిన విజయం కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ఇంద్రాణి విద్యాసంస్థలు ప్రత్యేక గుర్తింపు సాధించాయని అన్నారు. కష్టపడి చదివితే గ్రామాల నుంచి కూడా జాతీయ స్థాయి విజయాలు సాధించవచ్చని పూజిత నిరూపించిందని అభినందించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )