డా తులసి వెంకట రమణా చార్యుల ను సన్మానిస్తున్న అక్షర కౌముది సంస్థ సభ్యులు

డా తులసి వెంకట రమణా చార్యుల ను సన్మానిస్తున్న అక్షర కౌముది సంస్థ సభ్యులు

డా తులసి వెంకట రమణా చార్యుల ను సన్మానిస్తున్న అక్షర కౌముది సంస్థ సభ్యులు
మల్కాజిగిరి,సెప్టెంబర్15, (ప్రజా కలం ప్రతినిధి)

మల్కాజ్ గిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ ప్రాంతానికి చెందిన కవి రచయిత తులసి వెంకట రమణా చార్యులు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఓరియంటల్ విభాగం లో *మసన చెన్నప్ప రచనలు పరిశీలన* అనే అంశం పై డా చంద్రశేఖర్ రావు పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేశారు.ఈ సందర్భంగా ఓ యు అధికారులు పత్రిక ప్రకటన విడుదల ద్వారా తెలుపగా ఈ సందర్భంగా అక్షర కౌముది సంస్థ పక్షాన డా తులసి వెంకట రమణా చార్యుల దంపతులను ను ఈస్ట్ ఆనంద్ బాగ్ లో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు తులసి విజయ లక్ష్మీ,ప్రధాన కార్యదర్శి మూర్తి శ్రీదేవి, కోశాధికారి బచ్చల మాధవి,కార్యవర్గ సభ్యులు కండ్లకుంట నరసింహాచార్యులు గుటూరు సత్యనారాయణ, మహాలక్ష్మీ రామచంద్రుడు కవి మిత్రులు సుధామత్రేయ రఘునాథ రెడ్డి,తాళ్లూరి వెంకట కృష్ణ సుజాత ముదిగొండ సంతోష్ కుమార్ శర్మ,సూరినేని రమేష్ తదితరులు అభినందనలు తెలియజేశారు,సన్మాన గ్రహీత డా తులసి రమణా చార్యులు మాట్లాడుతూ నా పరిశోధ పూర్తి చేయడానికి సహకరించిన వారందరికీ,అక్షర కౌముది సంస్థ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )