
మెట్ పల్లి టిపిఓ సస్పెండ్
మెట్ పల్లి టిపిఓ సస్పెండ్

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ 17(ప్రజా కలం) మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి రాజేంద్రప్రసాద్ ను సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం నాడు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మెట్ పల్లికి చెందిన జగ్గుల లావణ్య అనే మహిళ టిపిఓ రాజేంద్రప్రసాద్ అవినీతి అక్రమాలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును విచారించిన కలెక్టర్ సత్య ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. లంచం డిమాండ్, స్వీకరించడం, నకిలీ సంతకాలతో అక్రమ అనుమతి జారీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న టౌన్ ప్లానింగ్ అధికారి రాజేంద్రప్రసాద్ పై పట్టణానికి చెందిన జగ్గుల లావణ్య అనే మహిళ ఫిర్యాదు చేసింది విదితమే.
TAGS Hot News

