కోడ్‌ కూసినా.. తొలగించరా..?

కోడ్‌ కూసినా.. తొలగించరా..?

కోడ్‌ కూసినా.. తొలగించరా..
…నిద్ర లేవని అధికారులు..
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 30 (ప్రజా కలం) ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చి రోజులు గడుస్తున్నా.. ఇంకా పల్లెల్లో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు, నాయకులకు సంబంధించిన ఆనవాళ్లు దర్శనం ఇస్తూన్నాయి.గత రెండు రోజుల క్రితం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన,రాష్ట్ర ఎన్నికల సంఘం,జిల్లా కలెక్టర్ రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేయాలని, పార్టీల కు సంబంధించిన రాతలు తొలగించాలని ఆదేశాలు జారి చేసిన ఇక్కడి అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. మెట్‌పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం వద్ద ఏర్పాటు చేసిన గత ప్రభుత్వ అభివృద్ధి పనుల శిల పలకలు మాత్రం మూతపడకుండా దర్శనం ఇస్తన్నాయి. ఈ చిత్రాలను చూసిన పలువురు మేధావులు అధికారులు నిద్రమత్తు ఇంకా వదలలేరు కావచ్చు అని గుసగుసలాడుతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )