బ్రెయిన్ అన్యురిజంపై విజయం,రోగికి పునర్జన్మ ప్రసాదించిన న్యూరో సర్జన్లు

బ్రెయిన్ అన్యురిజంపై విజయం,రోగికి పునర్జన్మ ప్రసాదించిన న్యూరో సర్జన్లు

బ్రెయిన్ అన్యురిజంపై విజయం,రోగికి పునర్జన్మ ప్రసాదించిన న్యూరో సర్జన్లు


హనుమకొండ మార్చి 31 (ప్రజా కలం ప్రతినిధి):

ఆకస్మికంగా వచ్చే తీవ్రమైన తలనొప్పిని నిర్లక్ష్యం చేయడం ప్రాణాంతకం కావచ్చుననిమలక్పేట యశోద హాస్పిటల్ వైద్యులు హెచ్చరించారు.అత్యంత క్లిష్టమైన

‘బ్రెయిన్ అన్యురిజం’ (మెదడులోని రక్తనాళం ఉబ్బి పగిలిపోవడం) సమస్యతో ప్రాణాపాయ స్థితిలో చేరిన ఒక 49 ఏళ్ల వ్యక్తికి అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి వైద్య బృందం ప్రాణాలను కాపాడింది. మంగళవారం రోజున హనుమకొండ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రిలో చేరిన రోగికి పరీక్షలు నిర్వహించగా,మెదడులోని ప్రధాన రక్తనాళం ఉబ్బి(అన్యురిజం) పగిలిపోవడం వల్ల రక్తస్రావం (హేమర్హజ్ ) జరిగినట్లు

గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కన్సల్టెంట్ న్యూరో సర్జన్డాక్టర్ జయానంద్ సుధీర్ నేతృత్వంలోని వైద్య బృందం తక్షణమే స్పందించింది. అన్యురిజం నిర్మాణం సంక్లిష్టంగా ఉండటంతో సాధారణ

పద్ధతులు సాధ్యం కాలేదు. దీనితో వైద్యులు ‘ఓపెన్ బ్రెయిన్ మైక్రో సర్జికల్ క్లిప్పింగ్’ నిర్వహించాలని నిర్ణయించారు. టైటానియం క్లిప్ను ఉపయోగించి Stroke: TimBrain L పగిలిన రక్తనాళాన్ని విజయవంతంగా మూసివేసి, మెదడుకు రక్త ప్రసరణను

పునరుద్ధరించారు.ఈ చికిత్సలో డాక్టర్ వంశీ రెడ్డి బృందం కీలక పాత్ర పోషించింది. అత్యాధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో రోగి ఎటువంటి నరాల సంబంధిత లోపాలు లేకుండా వేగంగా కోలుకున్నారు. సర్జరీ జరిగిన కేవలం ఐదు రోజుల్లోనే రోగి

స్వయంగా నడుచుకుంటూ డిశ్చార్జ్ కావడం విశేషం. మలక్పేట యశోదలో అందుబాటులో ఉన్న 24/7 న్యూరో క్రిటికల్ కేర్ వసతుల వల్లే ఇలాంటి క్లిష్టమైన కేసులు సాధ్యమవుతున్నాయని హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ గోరుకంటి పవన్ యూనిట్ హెడ్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )