గంజాయి విక్రతలపై కఠిన చర్యలు

గంజాయి విక్రతలపై కఠిన చర్యలు

గంజాయి విక్రతలపై కఠిన చర్యలు
కోరుట్ల సీఐ సురేష్ బాబు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి అక్టోబర్ 23 (ప్రజా కలం) గంజాయి విక్రయించిన కొనుగోలు చేసిన కఠిన చర్యలు తప్పవని కోరుట్ల సీఐ సురేష్ బాబు పేర్కొన్నారు. కోరుట్ల హాజీపూర్ లోని ఎస్ కె చాంద్ అనే వ్యక్తి కాలి స్థలంలో తుమ్మ చెట్ల మధ్య ఉత్తరప్రదేశ్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఒక కాళీ డ్రమ్ములో 9 గంజాయి మొక్కలను పెంచుతుండగా కోరుట్ల ఎస్సై ఎం చిరంజీవి కిఅందిన సమాచారం మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. భోలా శంకర్, మౌర్య, కైలాష్ కుమార్, సాని ల నుండి 90,000/- విలువ గల, 9 గంజాయి మొక్కలను, ఇద్దరు వి ఆర్ ఏ లు, అగ్రికల్చర్ ఆఫీసర్ నాగమణి సమక్షంలో స్వాధీన పరుచుకొని వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీన పరుచుకుని వారిని రిమాండ్ తరలించామని పేర్కొన్నారు. కాగా ఎస్ ఐ చిరంజీవి మాట్లాడుతూ వీరంతా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిని వెల్లడించారు. ఎవరైనా గంజాయి పండించిన విక్రయించిన, కొనుగోలు చేసిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకుంటామన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )