సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
కోరుట్ల ఎస్ఐ చిరంజీవి
సామాజిక అంశాలపై పోలీస్ కళ బృందం అవగాహన సదస్సు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి నవంబర్ 20 (ప్రజా కలం) సైబర్ మోసగాళ్ల వలలో చిక్కకుండా అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల ఎస్సై చిరంజీవి తెలిపారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామంలో పోలీస్ కళాబృందం వారు సైబర్ క్రైమ్,గంజాయి నిర్మూలన,మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ల మోసాలు, సైబర్ మోసాలు,నివారణ పై అవగాహన, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమం భాగంగా ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ ఈ మధ్యకాలం లో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా మోసపోయినట్టైతే 1930 నంబర్ కి పిర్యాదు చేయాలని,పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని వల్ల గ్రామంలో ఏ సంఘటన జరిగిన వెంటనే తెలుస్తోంది అని తెలిపారు, సిసి కెమెరాలు ఏర్పాటు సహకరించలని గ్రామస్థులను కోరారు. తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అన్నారు.యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని, ప్రభుత్వం ,పోలీస్ తరపున అన్ని విధాల సహాయహకారులు ఉంటాయని అన్నారు. వాహన దారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్  లేకుండ వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు.గ్రామాల్లో అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వున్న పోలీస్ స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు. గ్రామంలో చిన్న చిన్న తగాదాలకు పోయి జీవితం నాశనం చేసుకొవద్దని, నేరరహిత గ్రామాలుగా చేయడానికి ప్రజలు కృషి చేయాలనీ సూచించారు. మంత్రాలు, తత్రాలు ముడనమ్మకాలు నమ్మవద్దని, గ్రామాల్లో ఏ సమ్యస వున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపాలన్నారు,లేదా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసుఐ సిబ్బంది, పోలీస్ కళా బృందం సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )