కల్పకవనం అర్బన్ పార్కులో అగ్నిప్రమాదం

కల్పకవనం అర్బన్ పార్కులో అగ్నిప్రమాదం

కల్పకవనం అర్బన్ పార్కులో అగ్నిప్రమాదం

మంటలను అదుపులో తీసుకువచ్చిన ఫైర్ సిబ్బంది మరియు అటవీ శాఖ అధికారులు

గజ్వేల్ :07 ఏప్రిల్ 2026 ( ప్రజా కలం ప్రతినిధి )

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని సంగాపూర్ లో సుమారు 300 ఎకరాలతో ఏర్పాటు చేయబడింది. కల్పకవనం అర్బన్ పార్కులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు పది ఎకరాలలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతుండడంతో విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది, పోలీసుల సహాయంతో అటవీశాఖ అధికారులు ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బీట్ ఆఫీసర్ పవన్ కుమార్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని సంగాపూర్ గ్రామ శివారులో గల కల్పకవనం అర్బన్ పార్క్ సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో ఉందని తెలిపారు. కల్పకవనం అర్బన్ పార్కులో మంటలు వ్యాపిస్తున్నాయని వెంకటేశం అనే రైతు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని సుమారు మూడు గంటల పాటు కష్టపడి ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు. అగ్ని ప్రమాదం వల్ల పార్క్ లో ఉన్న జంతువులకు ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు. గ్రామ ప్రజలు యువకులు అడవులలో ఎలాంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )