
ఇబ్రహీంపట్నం సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా… కాశిరెడ్డి భాస్కర్ రెడ్డి,..
ఇబ్రహీంపట్నం సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా…
కాశిరెడ్డి భాస్కర్ రెడ్డి,..
ఇబ్రహీంపట్నం జనవరి 03 (ప్రజా కలం ప్రతినిధి )
ఇబ్రహీంపట్నం మండలం సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు గా అమ్మక్కపేట సర్పంచ్ కాశిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఇబ్రహీంపట్నం లో వివిధ గ్రామాల సర్పంచ్ లు సమావేశం నిర్వహించి ఫోరమ్ అధ్యక్షులుగా భాస్కర్ రెడ్డి ని, ఉపాధ్యక్షులుగా తరి రామానుజం ( వేముల కుర్తి ) లను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్ని అభివృద్ధి చేసే క్రమంలో సర్పంచ్ లు ఎదురుకుంటున్న సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశం లో వర్షకొండ సర్పంచ్ పొనకంటి వెంకటి, తిమ్మాపూర్ సర్పంచ్ బాస శ్రావణ్, ఎర్దండి సర్పంచ్ కల్లెడ గంగాధర్, గోధుర్ సర్పంచ్ బండి రాజేష్, కోమటి కొండాపూర్ సర్పంచ్ కోప్పెల్లా పద్మజ, ఎర్రపూర్ సర్పంచ్ తొగరి రచన, కోజన్ కొత్తూరు సర్పంచ్ చల్ల రక్షిత, ఫకీర్ కొండాపూర్ సర్పంచ్ తోట రమేష్, యామపూర్ సర్పంచ్ కనక నాగేష్ పాల్గొన్నారు.

