కాల్పుల ఘటనను ఛేదించిన మెట్‌పల్లి పోలీసులు.

కాల్పుల ఘటనను ఛేదించిన మెట్‌పల్లి పోలీసులు.

కాల్పుల ఘటనను ఛేదించిన మెట్‌పల్లి పోలీసులు.

ఆస్తి వివాదమే హత్యాయత్నానికి కారణం

సుపారీ ఇచ్చి కుట్ర..

యూపీ నుంచి నాటు పిస్టల్ తెప్పించిన నిందితుల అరెస్ట్


మెట్‌పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జులై 24 (ప్రజా కలం) మెట్‌పల్లి పట్టణంలో సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనను జగిత్యాల జిల్లా పోలీసులు ఛేదించారు.ఆస్తి వివాదాల నేపథ్యంలో సొంత అన్న భార్యను హత్య చేసేందుకు ముందస్తుగా కుట్ర పన్నిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నానికి ఉపయోగించిన నాటు పిస్టల్, రెండు సజీవ కార్ట్రిడ్జీలు, హోండా పాషన్ ప్రో మోటార్ సైకిల్, ఐఫోన్-11 మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, మెట్‌పల్లి డీఎస్పీ ఎ. రాములు పర్యవేక్షణలో సీఐ బి. సురేష్ బాబు, ఎస్‌ఐ పి. కిరణ్ కుమార్ నేతృత్వంలోని బృందం సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, ఆర్థిక లావాదేవీలు, మొబైల్ విశ్లేషణ ఆధారంగా కేసును ఛేదించింది.పోలీసుల దర్యాప్తులో, పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్, అతని భార్య అనూశ, బంధువు గోపి ముత్తయ్య లు ఆస్తి వివాదం కారణంగా గోనెల లక్ష్మిని హత్య చేయాలని కుట్ర పన్నినట్లు తేలింది. ఈ కుట్రలో భాగంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన జేసీబీ డ్రైవర్ సచిన్ కుమార్ అలియాస్ సచిన్ వర్మ ను డబ్బు, విదేశాలకు పంపిస్తామని ఆశ చూపి హత్యకు ఒప్పించినట్లు పోలీసులు వెల్లడించారు. సచిన్ వర్మ ఉత్తరప్రదేశ్‌లో రూ.40 వేలతో నాటు పిస్టల్, కార్ట్రిడ్జీలు కొనుగోలు చేసి మెట్‌పల్లికి తీసుకువచ్చాడు. 2026 జూన్ 15 అర్ధరాత్రి గోనెల లక్ష్మి ఇంటి వద్దకు వెళ్లి కాల్పులు జరపగా, బుల్లెట్ లక్ష్యాన్ని తప్పి ఆమె ఎడమ చెంపకు తగిలింది. అనంతరం ఘటనను గుర్తు తెలియని వ్యక్తుల దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి శస్త్రచికిత్సలో బుల్లెట్ బయటపడటంతో కేసు కీలక మలుపు తిరిగింది. అనంతరం సాంకేతిక ఆధారాల సహాయంతో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.స్వాధీనం చేసుకున్నవి ఒక నాటు పిస్టల్ రెండు సజీవ కార్ట్రిడ్జీలు హోండా పాషన్ ప్రో మోటార్ సైకిల్,ఐఫోన్-11 మొబైల్ ఫోన్ ఈ కేసును అంతర్రాష్ట్ర స్థాయిలో దర్యాప్తు చేసి విజయవంతంగా ఛేదించిన మెట్‌పల్లి సీఐ బి. సురేష్ బాబు, ఎస్‌ఐ పి. కిరణ్ కుమార్తో పాటు దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ డీఎస్పీ ఎ. రాములు అభినందించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )