నడికుడ ఉపసర్పంచ్ రాజీనామా

గ్రామం–పల్లె వివాదం…
నడికుడ ఉపసర్పంచ్ రాజీనామా
మల్లాపూర్ జనవరి 08 ( ప్రజా కలం ప్రతినిధి)
మండలంలోని నడికుడ గ్రామంలో గ్రామస్తుల మధ్య ఏర్పడిన వివాదం ఉపసర్పంచ్ రాజీనామాకు దారి తీసింది. నడికుడ గ్రామం లో గ్రామానికి అనుసంధానంగా పల్లె ఉండటం తో గ్రామంలో గతం నుంచి ఆనవాయితీగా అమలులో ఉన్న విధానం ప్రకారం సర్పంచ్ పదవి గ్రామానికి ఉంటే ఉపసర్పంచ్ పదవి పల్లెకు, పల్లెలో సర్పంచ్ ఉంటే గ్రామానికి ఉపసర్పంచ్ ఇవ్వాలనే నిర్ణయం ఉంది.
అయితే ఈసారి ఆ ఆనవాయితీని ఉల్లంఘిస్తూ గ్రామానికి సర్పంచ్ పదవి ఉన్నప్పటికీ ఉపసర్పంచ్ పదవిని కూడా గ్రామానికే కేటాయించడంతో నడికుడ పల్లె వాసులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో నేడు నడికుడ ఉపసర్పంచ్ తన రాజీనామా పత్రాన్ని ఎంపీడీవోకు అందచేశారని సమాచారం పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )