
మెట్‌పల్లి మున్సిపాలిటీలో ఆర్‌డిడీ విచారణ
మెట్‌పల్లి మున్సిపాలిటీలో ఆర్‌డిడీ విచారణ
మెట్‌పల్లి:(కోరుట్ల) ప్రతినిధి ఆగస్టు 1(ప్రజా కలం) పట్టణంలో ఓ ఇంటి నిర్మాణ అనుమతికి సంబంధించి మెట్టుపల్లి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మెట్‌పల్లి మున్సిపాలిటీలో శనివారం వరంగల్ ప్రాంతీయ సంచాలకులు (ఆర్‌డిడీ) విచారణ చేపట్టారు. ఇంటి నిర్మాణానికి అనుమతి ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారనే ఫిర్యాదులపై ఆర్‌డిడీ సంబంధిత పత్రాలను పరిశీలించడంతో పాటు, అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఫిర్యాదుదారుల వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తున్నట్లు సమాచారం. విచారణ అనంతరం సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వ్యవహారం మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో చర్చనీయాంశంగా మారింది.
TAGS Hot News

