
పట్టపగలే మహిళా మెడలో నగల అపహరణ
పట్టపగలే మహిళా మెడలో నగల అపహరణ
..అడ్డుకోబోయిన కుమారునిపై దాడికి ఉపక్రమరించిన దొంగలు..
… దొంగల కోసం పోలీసులు గాలింపు.
మెట్ పల్లి (ప్రజాకలం ప్రతినిధ)
మెట్పల్లి పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ వృద్ధురాలిపై దాడి చేసి మెడలో నుంచి బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం మెట్ పల్లి పట్టణంలోని రాంనగర్ కాలనీలో గల దోబీ ఘాట్ వద్ద బట్టలు ఉతుకుతున్న వృద్ధురాలు, ఆమే కొడుకు పై దొంగలు దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు.ఈ దాడిలో వృద్ధురాలికి, ఆమె కొడుకు తీవ్ర రక్త గాయాలవ్వగా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వారు ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ప్రాణాపాయం తప్పిందని తెలుస్తోంది. పట్టణంలో పట్టపగలే దాడి జరగడంతో కాలనీ, పట్టణ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
*అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలి.. ఎస్సై కిరణ్ కుమార్*
వృద్ధురాలపై దాడి చేసి బంగారం ఎత్తుకుపోయిన ఘటనలో పోలీసులు అలర్ట్ అయ్యారు టీ మేరకు ఎస్సై కిరణ్ కుమార్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వృద్ధురాలిపై దాడి చేసి బంగారాన్ని అపహరించిన దొంగలు మెరూన్ కలర్ షర్ట్, తెల్లని షర్ట్ తో ముఖానికి మాస్క్ లు ధరించి ద్విచక్ర వాహనంపై వచ్చి దాడి చేసినట్లు. తెలిసిందని. ఎవరైనా అటువంటి పోలికలతో అనుమానస్పదంగా కనిపిస్తే 87126 56794 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.

