
యాదాద్రి జిల్లా కలెక్టర్ కు రాష్ట్రస్థాయి పురస్కారం
యాదాద్రి జిల్లా కలెక్టర్ కు రాష్ట్రస్థాయి పురస్కారం
ఎన్నికల నిర్వహణలో జిల్లాకు రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారం
యాదాద్రి / జనవరి 25 ప్రజాకలం:ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరచినందుకు, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు,రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించింది. ‘బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు”2025’కు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి. హనుమంతరావుని,రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఎంపిక చేసింది.ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.జిల్లాలో ఓటరు జాబితా రూపకల్పన,ఓటర్ల నమోదు ప్రక్రియ,ఎన్నికల విధుల్లో పాటించిన ఉత్తమ విధానాలను పరిగణనలోకి తీసుకొని అవార్డును ప్రకటించినట్లు,అధికారులు తెలిపారు.ఈ అవార్డును 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్రస్థాయి వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.ఎన్నికల ప్రక్రియలో కీలకపాత్ర వహించిన ఎన్నికల అధికారులు,సిబ్బంది, ఎన్నికల నిర్వహణలో భాగ్యస్వామి అయినా ప్రతి ఒక్క అధికారికి,జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు.యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం పట్ల,జిల్లా అధికారులు,ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

