మైనార్టీకి వైస్ చైర్మన్ పదవి

మైనార్టీకి వైస్ చైర్మన్ పదవి

  1. మైనార్టీకి వైస్ చైర్మన్ పదవి

– బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు

 

మెట్ పల్లి(కోరుట్ల) ప్రతినిధి ఫిబ్రవరి 14 (ప్రజా కలం) మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు తమతో సహకరించిన మైనార్టీ అభ్యర్థికి వైస్ చైర్మన్ పదవిని ఇస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు స్పష్టం చేశారు. గత రెండు రోజుల క్రితం విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థులు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థుల గెలుపుతో మెట్ పల్లికి పూర్వ వైభవం వచ్చిందన్నారు. మెట్ పల్లి పట్టణంలో మైనారిటీలకు వైస్ చైర్మన్ ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఇతర ఏ పార్టీ కూడా మైనారిటీలకు వైస్ చర్మన్ పదవి ఇస్తామని చెప్పలేదని అన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన మైనారిటీ కౌన్సిలర్లు టచ్ లో ఉన్నారని తెలిపారు. ధర్మపురి అరవింద్ నేతృత్వంలో మైనార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు వైస్ చైర్మన్ ఇస్తామని మాకు ఆదేశాలు ఇచ్చారన్నారు. మెట్ పల్లి పట్టణంలో 26 వార్డులకు 14 వార్డులు గెలుస్తాం అనుకున్నామని, కానీ పది స్థానాలు కైవసం చేసుకున్నామన్నారు. బీజేపీ గతంలో మెట్ పల్లికి కంచుకోటగా ఉందని, ఇక్కడి నుండి సీనియర్ నాయకులు చెన్నమనేని విద్యాసాగర్ 4 సార్లు ప్రాతినిధ్యం వహించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాదం ఉన్నప్పుడు రెండు దఫాలు కోరుట్ల నియోజకవర్గ వర్గ ప్రజలు బీఆర్ఎస్ కు మొగ్గు చూపారని, ఇప్పుడు మళ్లీ బీజేపీకి ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు. మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని సొంతం చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో మెట్ పల్లిని స్మార్ట్ సిటీగా మార్చుకోవడానికి అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణలో మార్పు మెట్ పల్లి నుంచే మొదలయిందని, త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ హవా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మెట్ పల్లి ఎన్నికల ఇంచార్జీ అమ్దాపూర్ రాజేష్, పోలీస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )