
టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
*టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి*
పెద్దపల్లి,జూన్ 28:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
పెద్దపల్లి పట్టణంలోని రాజీవ్ రహదారిపై ఆదివారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.లారీ టిప్పర్ వాహనం ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో,ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.పోలీసులు మరియు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..పెద్దపల్లి పట్టణంలోని కొంతం వాడకు చెందిన వరాల కొమురయ్య (52)
తన ద్విచక్ర వాహనంపై ప్రగతి నగర్ నుండి బస్టాండ్ వైపు వెళ్తున్నారు.అదే సమయంలో కరీంనగర్ నుండి గోదావరిఖని వైపు వెళ్తున్న లారీ టిప్పర్ వాహనం,అయ్యప్ప దేవాలయం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కొమురయ్య ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాద తీవ్రతకు కొమురయ్య తలకు బలమైన గాయాలవ్వడంతో,ఆయన అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు.సమాచారం అందుకున్న వెంటనే పెద్దపల్లి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని,పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

