యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.

యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.

యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.

నాలుగు నెలల గర్భిణీని చంపిన భర్త

..ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్న జంట..

..జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ లో ఘటన..

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి మార్చి 17 (ప్రజా కలం) జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 4 నెలల గర్భిణీ భార్య పై భర్త కత్తితో దాడి చేసి చంపేశాడు. మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన గంధం ప్రసాద్, రాణి దంప తులకు కూతురు వైష్ణవి, కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తరి సాయిలు, సాయవ్వ దంపతుల కుమారుడు హరిబాబుతో దాదాపు ఏడాదిన్నర క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇటీవల వైష్ణవి 4 నెలల గర్భిణీ కావడంతో తల్లిగారింట్లో ఉంటుంది. హరిబాబు కూడా భార్యతో ఉంటూ కోరుట్ల లోని ప్రభుత్వ హాస్పిటల్ లో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం రాత్రి ఇంట్లో వైష్ణవి, హరిబాబు దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపొద్రేకంలో వైష్ణవి పై కత్తితో విచక్షణరహితంగా దాడి చేయగా తీవ్ర రక్తస్రావంతో చనిపోయింది. ఇవాళ తెల్లవారు జామున గదికి బయట నుంచి గొళ్ళెం పెట్టి హరిబాబు వెళ్ళిపోయాడు. నిద్ర లేచిన వైష్ణవి తల్లిదండ్రులు అనుమానంతో గది తలుపులు తీసి చూసేసరికి వైష్ణవి చనిపోయి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. డెడ్ బాడీ ని ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీకి తరించారు.ఇదిలా ఉంటే నిందితులకు ఉరిశిక్ష పడే వరకు తాము వదిలిపెట్టమని, లేదంటే తామే వారిని చంపేస్తామంటూ వైష్ణవి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మాదాపూర్ గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ నెలకొనగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )