‘బస్సుల బంద్’ తో స్తంభించిన రవాణా వ్యవస్థ…

‘బస్సుల బంద్’ తో స్తంభించిన రవాణా వ్యవస్థ…

‘బస్సుల బంద్’ తో స్తంభించిన రవాణా వ్యవస్థ…
– డిపోలకే పరిమితమైన బస్సులు
– బస్సులు, ప్రయాణికులు లేక బోసిపోతున్న బస్టాండ్లు
– ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న ప్రజలు
– ఆర్టీసీ బందుతో భారీగా దండుకుంటున్న ప్రైవేటు వాహనాల యజమానులు

 .ప్రయాణికులు లేక వెలవెలబోతున్న బస్సు స్టాండ్.

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 22 ప్రజా కలం :

తమ డిమాండ్ల సాధన కోసం టిఎస్ ఆర్టీసి కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది . ప్రజలు తమ అత్యవసర ప్రయాణాల కోసం ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తుండగా, ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వాహనాల యజమానులు భారీగా దండుకుంటున్నారు. అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

జిల్లాలో డిపోల కే పరిమితమైన బస్సులు…

నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడంతో కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయటకు కదలడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలైన ఆటోలు, కార్లు, టాటా ఏసీలను ఆశ్రయిస్తున్నారు.

టీఎస్ ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కమిటీ నాలుగు వారాల సమయం కోరగా, అందుకు ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు. దీంతో సమ్మె అనివార్యమైంది.


  ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న ప్రజలు.

 

ప్రత్యమ్నాయ ఏర్పాట్ల లో అధికారులు…..

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వెళ్లడంతో ప్రజా రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యమ్నాయ చర్యలు చేపడుతోంది. జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని RTOలకు రవాణాశాఖ ఆదేశించింది. ప్రైవేటు డ్రైవర్లు, వాహనాల వివరాలు సేకరించి, అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఏది ఏమైనాప్పటికీ ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )