
ఆర్టీసీ షాక్.. ప్రయాణికులకు లక్
ఆర్టీసీ షాక్.. ప్రయాణికులకు లక్
-నేడు పురుషులకు కూడా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం
పెద్దపల్లి,ఏప్రిల్ 22:(ప్రజాకలం జిల్లా ప్రతినిధి)
రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ డ్రైవర్లు,కండక్టర్ల సమ్మె పిలుపుతో పెద్దపల్లి జిల్లాలో ప్రయాణికులకు ఊహించని వెసులుబాటు లభించింది. సమ్మె కారణంగా కండక్టర్లు విధులకు హాజరుకాకపోవడంతో,ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం రోజున బస్సుల్లో ప్రయాణించే మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణాన్ని ప్రకటించారు.గోదావరిఖని డిపోకు చెందిన పలు బస్సులు కండక్టర్లు లేకుండానే కేవలం డ్రైవర్ల సహాయంతో నడుస్తున్నాయి.టికెట్లు ఇచ్చే సిబ్బంది లేకపోవడంతో,పై అధికారుల ఆదేశాల మేరకు డ్రైవర్లు ప్రయాణికులందరినీ ఉచితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు.ఎప్పుడూ లేని విధంగా పురుషులకు కూడా ఉచిత సౌకర్యం కల్పించడంతో పెద్దపల్లి బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది.ఈ వెసులుబాటు కేవలం ఈరోజు మాత్రమే ఉంటుందని,సమ్మె తీవ్రతను బట్టి రేపటి నిర్ణయం ఉంటుందని డ్రైవర్లు వెల్లడించారు.మహిళలకు ఎలాగో ఫ్రీ ఉన్న తరుణంలో,తమకు కూడా నేడు ఉచిత ప్రయాణం లభించడం పట్ల పురుష ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

