
నిబంధనల మేరకే కో ఆప్షన్ ఎన్నిక
నిబంధనల మేరకే కో ఆప్షన్ ఎన్నిక
మిడిమిడి జ్ఞానంతో నాయకులు అపహస్యం కావద్దు
మెట్ పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి ఏప్రిల్ 22(ప్రజా కలం) నిబంధనల మేరకే కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేయడం అయినదని మెట్పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కో ఆప్షన్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం ఎజెండా పై వచ్చిన ఆరోపణలు నిరాధారణమైనవన్నారు. వ్యక్తిగత కక్ష, రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నట్లు మండిపడ్డారు.తెలంగాణ మున్సిపల్ యాక్ట్ ప్రకారం 2019 చాప్టర్ 2 సెక్షన్ 23 (1)(బి) ప్రకారం మున్సిపల్ ఎజెండా తయారు చేసే పూర్తి అధికారాలు చైర్పర్సన్ కు ఉందన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఎన్నిక కోసం ప్రత్యేకంగా జారీ చేసిన సర్క్యులర్ కాలం నెంబర్ 4 లో సంపూర్ణంగా సమావేశాలు నిర్వహించే అధికారం చైర్పర్సన్ కున్నట్టు స్పష్టంగా ఉందన్నారు. అవగాహన లేక మిడిమిడి జ్ఞానంతో కొందరు ఆరోపణలు చేయడం సరి కాదని అన్నారు. సోషల్ మీడియాలో ఆరోపణలు నిరాధారమైనవని, చౌకబారు విమర్శలతో ప్రజల్లో అపహాస్యం కావద్దని నాయకులకు హితవు పలికారు. పట్టణ అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు అభివృద్ధిపై చర్చించుకుంటూ పట్టణ అభివృద్ధి పై దృష్టి సాధిస్తే చైర్మన్ పై ఆరోపణ చేయడం తగదన్నారు. కో ఆప్షన్ ఎన్నిక వాయిదా పడుతుందని ఆరోపణలు చేయడం తప్పని, యధావిధిగా కో ఆప్షన్ ఎన్నికల చట్ట ప్రకారమే జరుగుతాయన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు బత్తుల నరేష్, పందిరి రమేష్, రెబ్బాస్ మహేష్, గుడికందుల అజయ్, మాసుల ప్రవీణ్, నునుగొండ నరేష్, నాయకులు ముఖిమ్ తదితరులు పాల్గొన్నారు.

