విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను అల్లుకున్న చెట్ల తీగలు

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను అల్లుకున్న చెట్ల తీగలు

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను అల్లుకున్న చెట్ల తీగలు
సంబంధించిన అధికారికి ఫోన్ చేసి చెప్పిన పట్టించుకోని వైనం
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ 19 (ప్రజా కలం)మెట్ పల్లి మండలంలోని మేడిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రధాన దారి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రమాదకరంగా మారింది. వర్షాలు విరివిగా కురుస్తుండడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ పిచ్చి మొక్కలు, ఇతర మొక్కల తీగలు ఏపుగా అల్లుకున్నాయి
పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకోని అధికారులు దీనికి సంబంధించిన అధికారి ఏఈ ప్రశాంత్ కి మా విలేఖరి ఫోన్ చేసి మాట్లాడి సంబంధించిన ఫోటోలు అధికారికి వాట్స్అప్ ద్వారా జూన్ 15 తేదీన పంపడం జరిగింది. అయినా ఇప్పటికీ చర్యలు ఏమీ లేవు,కాలనీ వాసులు వివిధ పనుల నిమిత్తం ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ పక్కనే రాకపోకలు సాగిస్తున్నారు. మొక్కలకు విద్యుత్‌ సరఫరా అయ్యి ప్రమాదం జరిగే అవకాశాలు లేకపోలేదు. అటువైపు వెళ్లే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్‌శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )