కౌన్సిలర్ల వాకౌట్…?

కౌన్సిలర్ల వాకౌట్…?

కౌన్సిలర్ల వాకౌట్…?

 

మెట్ పల్లి మున్సిపల్ సమావేశంలో అన్ని పార్టీల కౌన్సిలర్ల వాకౌట్…!!

 

చైర్‌పర్సన్ ఏకపక్ష ధోరణిపై నిరసన..

 

వార్డుల అభివృద్ధిపై సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణ

 

 

మెట్ పల్లి:( కోరుట్ల ప్రతినిధి అక్టోబర్ 29 (ప్రజా కలం) మున్సిపల్ చైర్‌పర్సన్ మైలారపు లింబాద్రి వ్యవహారశైలిని నిరసిస్తూ మెట్పల్లి మున్సిపాలిటీ సాధారణ సర్వసభ్య సమావేశం నుంచి అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. చైర్‌పర్సన్ ఏకపక్ష ధోరణిని అవలంబిస్తున్నారని, కౌన్సిల్‌లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి కౌన్సిలర్లకు సరైన సమాచారం అందించడం లేదని వారు ఆరోపించారు. తమ వార్డుల్లో చేపట్టే అభివృద్ధి పనులు, ఇతర కీలక అంశాలపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి నెలకొందని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తమకు వార్డుల అభివృద్ధి విషయంలో తగిన సమాచారం, ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఒకేసారి సమావేశం నుంచి వాకౌట్ చేయడం మెట్పల్లి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.మున్సిపల్ పాలకవర్గంలో నెలకొన్న ఈ పరిస్థితి పట్టణ అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై పట్టణవాసుల్లో చర్చ జరుగుతోంది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )