దగాపడ్డ కళాకారులకు న్యాయం చేయండి*

దగాపడ్డ కళాకారులకు న్యాయం చేయండి*

*దగాపడ్డ కళాకారులకు న్యాయం చేయండి*
*జూలై 13న మెదక్‌లో పాటల పల్లకిలో 12 గంటలు
*న్యాయం కోసం చలో మెదక్‌
-ఉద్యమ కళాకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు మద్దెల నర్సింలు
సిద్దిపేట,జూలై 04:(ప్రజాకలం జిల్లా ప్రతినిధి)
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి,ప్రస్తుతం గుర్తింపుకు నోచుకోని కళాకారుల దీనస్థితిని ఎత్తిచూపేందుకు గాను తెలంగాణ ఉద్యమ కళాకారులు మెదక్‌లో ఒక ముఖ్యమైన కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నారు.ఈనెల 13న మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో పాటల పల్లకిలో 12 గంటలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు మద్దెల నర్సింలు తెలిపారు.ఈ మేరకు శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మద్దెల నర్సింలు స్థానిక కళాకారులతో కలిసి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నర్సింలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం నిస్వార్థంగా తమ కళలను,గళాలను వినియోగించి,యావత్ తెలంగాణ ప్రజలను చైతన్య పరిచి కీలకపాత్ర వహించిన ఉద్యమ కళాకారులకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంస్కృతిక సారథిలో అర్హులైన వారికి ఉద్యోగాలు రాకపోవడం చాలా బాధాకరమని అన్నారు.ఈ ప్రభుత్వమైనా ఉద్యమ కళాకారులను గుర్తించి, తక్షణమే ఉద్యోగాలు ప్రకటించి,దగాపడ్డ కళాకారులను ఆదుకోవాలని ఆయన కోరారు.జులై 13న జరిగే పాటల పల్లకిలో 12 గంటలు కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమ కవి గాయకులు నేర్నాల కిషోర్,చక్రాల రఘు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఉద్యమ కళాకారులందరూ ఈ కార్యక్రమానికి వస్తున్నారని నర్సింలు తెలిపారు.దగాపడ్డ కళాకారులందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బండకాడి గణేష్,ఉద్యమ కళాకారులు కళా ప్రసాద్,తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పిన్నింటి దాసు,రాష్ట్ర కార్యదర్శి ఎర్రవల్లి శీనువాస్,గుండెల్లి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )