భూభారతి దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించిన ఆర్.డి.ఓ*

భూభారతి దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించిన ఆర్.డి.ఓ*

*భూభారతి దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించిన ఆర్.డి.ఓ*
బస్తా సిమెంట్ కి రూ.75 తక్కువ చేయించిన ఆర్డీఓ*
అడ్డగూడూర్/జులై 09(ప్రజాకలం ప్రతినిధి)
ఈనెల 05న అడ్డగూడూర్ మండల తహశీల్దార్ కార్యాలయానికి భూభారతి దరఖాస్తులు, రేషన్ కార్డుల పరిశీలనకు విచ్చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్.డి.ఓ కృష్ణారెడ్డి. అదేవిధంగా మానాయికుంట గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు అయిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించడం జరిగింది. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సిమెంట్, ఇనుప చువ్వ, ఇసుక రేట్లను గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, అక్కడే ఉన్న లబ్ధిదారుడు బోడ చంద్రయ్య ఆర్.డి.ఓ కి అడ్డగూడూర్ మండల సిమెంట్ డీలర్ బస్తా 350 రూపాయలు అమ్ముతున్నాడని, మేము సొంతంగా తీసుకొచ్చిన సిమెంట్ బస్తాలను దింపిన తరువాత డీలర్ బస్తాలను వెనక్కి పంపించడం జరిగిందని ఆర్డీఓ దృష్టికి తీసుకు వచ్చాడు. ఈ విషయంపై తక్షణమే స్పందించిన ఆర్డీఓ భువనగిరిలో ఉన్న సిమెంట్ యాజమాన్యంతో మాట్లాడి 275 రూపాయలకు బస్తా చొప్పున బుధవారం మానాయికుంట గ్రామ ఇందిరమ్మ లబ్ధిదారులకు పంపించడం జరిగింది. దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు ఆర్డీఓ కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ శేషగిరిరావు,ఆర్.ఐ. ఉపేందర్, పంచాయితీ కార్యదర్శి చంద్రశేఖర్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బోడ చంద్రయ్య,బోడ గంగయ్య,ఉడుగు మరయ్య,బోడ మంజుల,ననుబోతు ఐలయ్య,తీగల సైదులు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )