కార్మికుల సంక్షేమానికి గ్రహణం

కార్మికుల సంక్షేమానికి గ్రహణం

కార్మికుల సంక్షేమానికి గ్రహణం
*లేబర్ కార్డుల జారీ పథకాల అమలులో తీవ్ర జాప్యం
*కార్మికులకు దక్కని సంక్షేమ ఫలాలు
*పెద్దపల్లి ఏఎల్ఓ పై ఆరోపణలు బదిలీకి డిమాండ్
-దళిత బహుజన లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొంకూరి కైలాసం
పెద్దపల్లి,జూలై 13:(ప్రజాకలం జిల్లా ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అందించే పథకాలు పెద్దపల్లి లో అర్హులకు చేరడం లేదని దళిత బహుజన లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొంకూరి కైలాసం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత బహుజన లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొంకూరి కైలాసం మాట్లాడుతూ 2019 నుండి ప్రమాద మరణ ప్రయోజనం 6 లక్షల 30 వేలు,సాధారణ మరణ ప్రయోజనం 1లక్ష 30 వేలు,పెళ్లి కానుక 30వేలు,ప్రసూతి ప్రయోజనం 30వేల వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉన్నప్పటికీ,పెద్దపల్లి సహాయ కార్మిక అధికారి హేమలత తీరు వల్ల కార్మికులకు న్యాయం జరగడం లేదని ఆయన ఆరోపించారు.గతంలో హైదరాబాద్ బోర్డు ఆన్‌లైన్ ప్రక్రియను నిలిపివేయడంతో అనేకమంది కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలు పెండింగ్‌లో పడ్డాయి.ఆ తర్వాత మంథని,గోదావరిఖని సహాయ కార్మిక అధికారులు తిరిగి ఆన్‌లైన్ ప్రక్రియను ప్రారంభించి,పెండింగ్ వివరాలను హైదరాబాద్ బోర్డుకు పంపారని,అయితే పెద్దపల్లి సహాయ కార్మిక అధికారి హేమలత మాత్రం పెద్దపల్లి కార్మికులకు సంబంధించిన వివరాలను పంపడంలో నిర్లక్ష్యం వహించారని కైలాసం మండిపడ్డారు.దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వని పరిస్థితి పెద్దపల్లిలో నెలకొందని కైలాసం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.లేబర్ కార్డులు జారీ చేయడంలో,ఇతర సంక్షేమ పథకాలను అందించడంలో పెద్దపల్లి ఏఎల్ఓ హేమలత కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.ప్రశ్నించే వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని,దీంతో కార్మికులు కార్యాలయానికి వెళ్లడానికి భయపడుతున్నారని ఆయన వెల్లడించారు.భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరగాలంటే పెద్దపల్లి ఏఎల్ఓ హేమలతను తక్షణమే వేరే జిల్లాకు బదిలీ చేయాలని బొంకూరి కైలాసం డిమాండ్ చేశారు.తమ డిమాండ్లు నెరవేరకపోతే అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్షకు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు.కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించి,తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో కండే కరుణాకర్,రాజారామ్ లు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )