
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి
మెట్ పల్లి డివిజన్ ప్రజావాణి కార్యక్రమం ఆకస్మికం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
మెట్ పల్లి కోరుట్ల ప్రతినిధి మే 11 (ప్రజాకలం)
మెట్‌పల్లి పట్టణం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ప్రజల నుండి అందుతున్న వినతులు, ఫిర్యాదుల స్వీకరణ విధానాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉదేశ్యం తో గత వారం నుండి డివిజన స్థాయిలో ప్రజా వాణి కార్యక్రమాలు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సానుభూతితో విని, శాఖల వారీగా సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు న్యాయం చేకూరేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఆర్డీవో నరసింహ రావు, తహసీల్దార్ నీతా లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

