
పదేళ్ల బాలికపై అత్యాచారం
పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన గుజరాత్ రాష్ట్రానికి చెందిన
సంజయ్ అలియాస్ ఇర్ఫాన్ హుస్సేన్
శంషాబాద్, జులై 22, (ప్రజా కలం)
పదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం నాడు తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్ రాష్ట్రానికి చెందిన సంజయ్ అలియాస్ ఇర్ఫాన్ హుస్సేన్ కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం శంషాబాద్ కు వలస వచ్చాడు మంగళవారం తెల్లవారుజామున అతడు మద్యం మత్తులో శంషాబాద్ పట్టణంలోని ఇందిరా హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ కింద పదేళ్ల బాలికపై అత్యాచారానికి వడిగట్టాడు. స్థానికులు కుటుంబ సభ్యుల సమాచారంతో ఇన్స్పెక్టర్ బాలరాజు తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలు స్థానికంగా కుటుంబ సభ్యులతో కలిసి యాచిస్తూ జీవనం సాగిస్తూ ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న శంషాబాద్ పోలీసులు

