నిజాం షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన కలెక్టర్

నిజాం షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన కలెక్టర్

నిజాం షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన కలెక్టర్

జగిత్యాల జిల్లా, మార్చి 31 ( ప్రజా కలం ప్రతినిధి )
జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం మల్లాపూర్ మండలం ముత్యం పేట గ్రామంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. రాబోయే రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న గోదాములను ఆయన పరిశీలించారు.
వడ్ల నిల్వకు గోదాములు అనువుగా ఉన్నాయా అనే విషయాన్ని సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్, గోదాముల సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు, తేమ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వడ్లను సురక్షితంగా నిల్వ చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా, మెట్‌పల్లి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో వడ్లు నిల్వ చేయడానికి అనువైన గోదాములను గుర్తించాలని మెట్‌పల్లి ఆర్డీవో నరసింహారావుకు సూచించారు. రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికలతో నిల్వ సదుపాయాలు సిద్ధం చేయాలని చెప్పారు.
రాబోయే రబీ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర చర్యలు తీసుకోవాలని, నిల్వ సదుపాయాలను బలోపేతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ పరిశీలనలో మెట్‌పల్లి ఆర్డీవో నరసింహారావు, తహసీల్దార్ మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )