నల్గొండ బస్టాండ్ లో దారుణం..

నల్గొండ బస్టాండ్ లో దారుణం..

కన్నబిడ్డను వదిలేసి ప్రియుడితో జంప్
* ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తి కోసం కన్నబిడ్డను దిక్కు లేని అనాధగా బస్టాండులో వదిలేసి వెళ్ళిపోయిన తల్లి.
* నల్గొండ బస్టాండులో చోటుచేసుకున్న ఘటన
* ప్రియుడు తనవెంట రమ్మని వెంటపడడంతో… మానవత్వం మరిచి ముక్కుపచ్చలారని కన్నబిడ్డను దిక్కులేని అనాధగా వదిలేసి వెళ్లిన తల్లి
* బిక్కు బిక్కు మంటూ ఉండిపోయిన బిడ్డని గమనించి పోలీసులకు సమాచారమిచ్చిన ఆర్టీసీ సిబ్బంది
* సీసీ కెమెరాల ఆధారంగా ముందు తల్లి ఆనవాలు గుర్తించి.. ఆమె భర్తకు సమాచారమిచ్చి బిడ్డను అతనికి అప్పగించిన పోలీసులు

నల్గొండ జూలై 27 ప్రజాకలం:ఓ తల్లి మానవత్వాన్ని మరచి 2 సంవత్సరాల బాబును బస్టాండ్ లో వదిలి ప్రియుడితో వెళ్ళిన ఘటన నల్గొండ బస్టాప్ చోటుచేసుకుంది.ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ప్రియుడి కోసం ఓ తల్లి కన్నబిడ్డను దిక్కులేని అనాధగా వదిలేసి వెళ్లిపోయింది.ఈ దృశ్యం స్థానికంగా ఉన్న ఆర్టీసీ సిబ్బందిని,ప్రయాణికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.వివరాల్లోకి వెళితే, నల్గొండ బస్టాండ్లో ఓ చిన్నారి (దాదాపు 2 సంవత్సరాల వయసు) ఒంటరిగా ఏడుస్తూ కనిపించాడు.ఎవరు వదిలారు? అని అక్కడి సిబ్బంది,ప్రయాణికులు గమనించారు.ఆ చిన్నారి ఏడుపుతో,తల్లి కోసం చుట్టూ తిరుగుతున్న తీరు అందరి గుండెల్ని కలిచివేసింది. వెంటనే ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.ప్రియుడి కోసం కన్నబిడ్డను నల్గొండ బస్టాండ్లో వదిలేసి వెళ్లిన తల్లిని ఇప్పుడు అందరూ తిట్టిపోస్తున్నారు. . ఇన్ స్టా గ్రామ్ సోషల్ మీడియా పరిచయంతో మాయలో పడిన ఆమె..2 సంవత్సరాల బాబును అనాధలా వదిలేసి,ప్రియుడితో జంప్ అయ్యింది.సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించిన పోలీసులు చివరకు బాలుడిని తండ్రికి అప్పగించారు.
వివాహ బంధానికి రోజురోజుకు బీటలు వారుతున్నాయి.
ఇన్ స్టాగ్రామ్ లో పరచయామైన ప్రియుడు తనవెంట రమ్మని చెప్పడంతో కన్నబిడ్డను దిక్కు లేని అనాధగా నల్గొండ బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళింది ఓ మానవత్వం లేని తల్లి..అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియక..
బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్న 2 సంవత్సరాల చిన్నోడిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది,పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వచ్చి సీసీ కెమెరాల ఆధారంగా ముందు తల్లి ఆనవాలు గుర్తించారు.ఆమె భర్తను పిలిపించి..బిడ్డను ఆయనకు అప్పగించారు.ఈ దారుణమైన ఘటన నల్గొండ బస్ స్టాండ్ లో చోటుచేసుకుంది.నల్లగొండ పాతబస్తీకి చెందిన ఒక యువకుడితో హైద్రాబాద్ కు చెందిన వివాహితకు ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం ఏర్పడింది.ఆమెకు భర్త,2 సంవత్సరాల బాబు ఉన్నారు.వారిని వదిలేసి మహిళ ప్రియుడితో వెళ్లిపోవాలనుకుంది.డైరెక్ట్ గా హైదరాబాద్ నుండి నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ కు బాబుతో పాటు వచ్చి..చిన్నోడిని అక్కడే వదిలేసి వదిలేసి ఆ యువకుడితో జంప్ అయింది.బాబు తప్పిపోయాడన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు..బస్టాండ్లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా..బైక్ మీద వెళుతున్న మహిళ వీడియోను చూసి..ఆ బాలుడు తన తల్లిని గుర్తించాడని పోలీసులు తెలిపారు.ఆ బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా..విచారణ చేపట్టిన పోలీసులకు..బైకు యజమాని నుంచి అతని ఫ్రెండ్ వెహికిల్ తీసుకెళ్లినట్లు తేలింది. విచారణ చేయగా వారి ఇన్ స్టా లవ్ స్టోరీ బయపడింది. అనంతరం మహిళను ఆమె ఇన్ స్టాగ్రామ్ ప్రేమికుడిని.. ఆమె భర్తను పోలీస్ స్టేషన్ కు పిలిపించి..కౌన్సిలింగ్ ఇచ్చి.. బాలుడుని తండ్రికి పిల్లాడిని అప్పగించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )