
ప్రజ్ఞాపూర్‌లోని ‘జె.ఆర్ ఫ్యామిలీ ధాబా’పై టాస్క్‌ఫోర్స్, గజ్వేల్ పోలీసుల సంయుక్త దాడి
ప్రజ్ఞాపూర్‌లోని ‘జె.ఆర్ ఫ్యామిలీ ధాబా’పై టాస్క్‌ఫోర్స్, గజ్వేల్ పోలీసుల సంయుక్త దాడి
55.7 లీటర్ల మద్యం స్వాధీనం
గజ్వేల్:15 జూన్ 2026 ( ప్రజా కలం ప్రతినిధి)
నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరియు గజ్వేల్ టౌన్ పోలీసులు సంయుక్తంగా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ గ్రామంలోని ‘జె.ఆర్ ఫ్యామిలీ ధాబా’పై మెరుపు దాడి నిర్వహించారు.ఈ దాడిలో ధాబాలో అక్రమంగా నిల్వ ఉంచిన మొత్తం 55.7 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం నిల్వ చేసి విక్రయాలకు పాల్పడిన ధాబా యజమాని *అర్రవెల్లి రవి (45)*పై కేసు నమోదు చేసినట్లు గజ్వేల్ టౌన్ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ తెలిపారు.అలాగే, ధాబాలో అక్రమంగా మద్యం సేవిస్తున్న 17 మంది వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ,తమ ప్రాంతంలో ఎలాంటి అక్రమ లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించిన వెంటనే డయల్ 100 లేదా టాస్క్‌ఫోర్స్ ఫోన్ నంబర్ 8712667447కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

