
ప్రజా కలం ఎఫెక్ట్.. బోర్లు అండర్‌గ్రౌండ్
ప్రజా కలం ఎఫెక్ట్.. బోర్లు అండర్‌గ్రౌండ్
మల్లాపూర్ సెప్టెంబర్ 08 ( ప్రజా కలం ప్రతినిధి )
మల్లాపూర్ మండలం ముత్యం పేట గ్రామంలోని సీసీ రోడ్డుకు నడిమధ్యలో బోర్లు ఉండటంతో వాహనదారులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘ప్రజా కలం’దిన పత్రికల లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. రోడ్డు మధ్యలో ఉన్న బోర్ల కారణంగా గత కొంతకాలంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న విషయాన్ని కథనం ద్వారా వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు తక్షణమే చర్యలు చేపట్టారు.
రోడ్డుకు అడ్డంగా ఉన్న బోర్లను తొలగించి, రాకపోకలకు ఆటంకం కలగకుండా వాటిని అండర్‌గ్రౌండ్ బోర్లుగా మార్చారు. దీంతో వాహనదారులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సమస్యను వెలుగులోకి తీసుకువచ్చి, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ‘ప్రజా కలం’కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

TAGS Hot News

