
కార్మికుల ముఖాల్లో పండుగ వెలుగులు.. దసరా కానుకగా వస్త్రాలు
కార్మికుల ముఖాల్లో పండుగ వెలుగులు.. దసరా కానుకగా వస్త్రాలు
రెండో వార్డులో మున్సిపల్ సిబ్బందికి బట్టలు అందజేసిన కౌన్సిలర్ గోలీ మమత సంతోష్
గజ్వేల్: అక్టోబర్ 09 (ప్రజా కలం ప్రతినిధి):
దసరా పండుగను పురస్కరించుకుని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు వార్డు కౌన్సిలర్ గోలీ మమత సంతోష్ వస్త్రాలను అందజేశారు.ప్రతిరోజూ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ,పరిసరాల పరిశుభ్రత కోసం శ్రమించే కార్మికులతో పండుగ సంతోషాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ గోలీ మమత సంతోష్ మాట్లాడుతూ.. వార్డును నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని అన్నారు. ఎండ,వానలను సైతం లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే కార్మికులకు దసరా పండుగ సందర్భంగా వస్త్రాలు అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్మికుల సేవలను గుర్తించి, వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.పండుగ వేళ వస్త్రాలు అందుకోవడంతో కార్మికుల్లో ఆనందం వ్యక్తమైంది.

