జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు…

జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు…

జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు…

 

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

 

 

అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదు

 

జగిత్యాల ప్రతినిధి ఆగస్టు 31 (ప్రజా కలం)

 

 

జగిత్యాల జిల్లా శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్‌ 1 నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు పోలీస్‌ యాక్ట్‌–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌ పేర్కొన్నారు. పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలను వినియోగించరాదని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించడం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, ఇతర చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం వంటివి చేయరాదని హెచ్చరించారు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని ఎస్పీ కోరారు. ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఎస్పి అశోక్ కుమార్ వెల్లడించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )