
పారదర్శకంగా విధులు నిర్వహించాలి
పారదర్శకంగా విధులు నిర్వహించాలి
మెట్ పల్లి డీఎస్పీ రాములు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి ఆగస్టు 31 (ప్రజా కలం):విధుల్లో పోలీసులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని మెట్ పల్లి డీఎస్పీ రాములు వెల్లడించారు. కోరుట్ల పోలీస్‌స్టేషన్‌ను డీఎస్పీ రాములు సందర్శించి సమగ్రంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి వారి విధుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్‌స్టేషన్‌లోని కేసులకు సంబంధించిన ఫైల్స్, వివిధ రకాల రిజిస్టర్లు, రికార్డులు, ఇతర ముఖ్యమైన దస్తావేజులను డీఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణపై సమీక్షించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించిన డీఎస్పీ స్టేషన్లో పరిశుభ్రత, రికార్డుల సక్రమ నిర్వహణతో పాటు ప్రజలకు అందుతున్న పోలీస్ సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు సిబ్బంది అంకితభావం, క్రమశిక్షణ, అప్రమత్తతతో విధులు నిర్వహించాలని డీఎస్పీ సూచించారు. ప్రజల సమస్యలను సానుకూలంగా స్వీకరించి, చట్టపరంగా వేగవంతమైన పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీఎస్పీ రాములు సూచించారు. ఈ వార్షిక తనిఖీలో కోరుట్ల పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

