
బిల్డర్ హత్య కేసులో నిందితుని ఆరెస్ట్
- బిల్డర్ హత్య కేసులో నిందితుని ఆరెస్ట్
వివరాలు వెల్లడించిన మెట్ పల్లి డిఎస్పి రాములు

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ 23 (ప్రజా కలం) పట్టణంలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు మెట్ పల్లి డిఎస్పి రాములు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం నాడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిల్డర్ రాజేంద్రప్రసాద్ (55)హత్య కేసు కు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించి తన వద్ద పనిచేసే గౌతమ్ కుమార్ రాజేంద్రప్రసాద్ హత్య చేసినట్లు గుర్తించి తరలించినట్లు తెలిపారు. మొదట అనుమానస్పద మృతిగా నమోదు చేసిన ఈ కేసును దర్యాప్తు చేసి తన వద్ద పని చేసే ఉత్తరప్రదేశ్ కి చెందిన కార్మికుడు ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. మెట్ పల్లి పట్టణానికి చెందిన రాజేంద్రప్రసాద్ ఇంటి నిర్మాణాలు చేసి విక్రయిస్తుంటాడని తెలిపారు. ఈ క్రమంలో తాను నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనితీరును పరిశీలించేందుకు వెళ్లిన రాజేంద్రప్రసాద్ అక్కడ విగతజీవిగా పడి ఉన్నట్టు కుటుంబ సభ్యులకు సమాచారం రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. హత్య కేసులో నిందితుని పట్టుకోవడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన మెట్ పల్లి సీఐ సురేష్ బాబు ఎస్ఐలు కిరణ్ కుమార్ నవీన్ కుమార్ అనిల్ కుమార్ ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించినట్లు వెల్లడించారు.

